నగరం లోకి చెడ్డీ గ్యాంగ్‌..జాగ్రత్త

హైదరాబాద్ వాసులకు హెచ్చరిక..నగరం లోకి చెడ్డీ గ్యాంగ్‌ ఎంట్రీ ఇచ్చినట్లు పోలీసుల నిఘాలో తేలింది. ఓ కేసు నిమిత్తం పోలీసులు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్న క్రమం లో ఈ చెడ్డీ గ్యాంగ్‌ కనిపించారు. మియాపూర్‌, కూకట్‌ పల్లి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్‌ తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

చెడ్డీలు, బనియన్లు ధరించి ముఖానికి ముసుగు వేసుకున్న ఈ గ్యాంగ్‌లో నాలుగు నుంచి ఏడుగురు సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌ సభ్యులు ఆయుధాలతో అర్ధరాత్రి పూట తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు బెంగళూరు, మహారాష్ట్రలలో దోపిడీలకు పాల్పడ్డ ముఠా తాజాగా నగరంలోకి వచ్చింది. అర్థరాత్రి ఒంటరిగా వెళ్లేవారు, ఇండిపెండెంట్‌ ఇళ్లే ఈ గ్యాంగ్‌ టార్గెట్‌ అని పోలీసులు చెపుతున్నారు. ఏ మాత్రం అనుమానం గా కనిపించిన ,రాత్రి పూట చెడ్డీలు, బనియన్లు ధరించి ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది గా హెచ్చరించారు.