మహిళా బ్యాగ్ నుండి కోటి రూపాయిల బంగారం అపహరణ..

మహిళా బ్యాగ్ నుండి దాదాపు కోటి రూపాయిల బంగారం చోరీ కి గురైన ఘటన గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వేళ్తే..రాజమహేంద్రవరానికి చెందిన వాణి హైదరాబాద్ లోని మియాపూర్‌లో నివాసం ఉంటుంది.

బంధువుల శుభకార్యం ఉండటంతో రాజమహేంద్రవరానికి వెళ్లిన ఆమె తిరిగి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి గురువారం ఉదయం సికింద్రాబాద్‌ చేరుకుంది. రైలు దిగే సమయంలో బ్యాగు చూసుకోగా అందులో ఉండాల్సిన రూ.5లక్షల నగదుతో పాటు రూ.కోటి విలువ గల బంగారు నగలు చోరీకి గురైనట్లుగా ఆమె గుర్తించింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిర్యాదు తీసుకున్న పోలీస్ లు రంగం లోకి దిగారు.

loading...