టెక్‌ మహీంద్రాలో భారీగా కొలువులు..

ప్రముఖ సాఫ్ట్ వెర్ కంపెనీ టెక్‌ మహీంద్రా మరోసారి భారీగా కొలువులు ప్రకటించింది. అమెరికా లో ఈ కొలువులు ఉన్నట్లు ప్రకటించింది. గత ఏడాది మాదిరిగానే , ఈ ఏడాది కూడా అమెరికా లో దాదాపు రెండు వేల మంది ని తీసుకొనబోతున్నట్లు తెలిపింది. అమెరికాలో ఉద్యోగాల సృష్టించాలన్న అక్కడి ప్రభుత్వ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం అమెరికాలోని టెక్‌ మహీంద్రాలో 6 వేల మంది ఉద్యోగులున్నారు. నాలుగేళ్లుగా వివిధ కళాశాల నుంచి వీరిని నియమించుకున్నారు. ఇందులో భాగంగా గతేడాది 2200 మందిని కంపెనీలో ఉద్యోగులుగా నియమించినట్లు టెక్‌ మహీంద్రా ప్రెసిడెంట్‌ తెలిపారు. ప్రస్తుతం టెక్‌ మహీంద్రా అమెరికాలో 28 నగరాల్లో సేవలందిస్తోంది.