వావ్.. అమీర్ రేమ్యునిరేషన్ రూ.175 కోట్లు

amir

అమీర్ నటించిన ‘దంగల్‌’ ఘన విజయం సాదించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ. 400 కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది దంగల్. అయితే ఈ సినిమాకి అమీర్ తీసుకున్న రేమ్యునిరేష్ తెలిస్తే షాక్ అవుతారు. ఈ సినిమాకు ఆమిర్‌ సుమారు రూ.175 కోట్లు తీసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి.

డిస్నీ యూటీవీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఆమిర్‌ సినిమా చిత్రీకరణకు ముందు అడ్వాన్స్‌గా రూ.35 కోట్లు తీసుకున్నాడట. దీనితో పాటు ఒప్పందంలో భాగంగా 33 శాతం వాటా, శాటిలైట్‌ రైట్స్‌, సినిమా విడుదలయ్యాక వచ్చే కలెక్షన్స్‌లో మరో 33 శాతం వాటా తీసుకున్నాడట. ఈ మొత్తం కలిపి మొత్తం రూ.175 కోట్లుగా తేలింది. ఇప్పటివరకూ బాలీవుడ్ హీరోల్లో ఇదే హయ్యెస్ట్ రేమ్యునిరేషన్ కావడం విశేషం

ప్రముఖ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెల్సిందే. నితీశ్‌ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి తన్వార్‌, ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రా, అపర్‌శక్తి ఖుర్రానా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.