మహేష్ కోసం పాట పాడుతున్న హీరోయిన్

హీరోయిన్ ఆండ్రియా సింగర్ కూడా. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసిన ‘బొమ్మరిల్లు’లోని ‘వి హావ్‌ ఏ రోమియో’, ‘రాఖీ’లోని ‘జర జర’, ‘ఎవడు’లోని ‘ఓయ్‌ ఓయ్‌’ పాటలను ఆమె పాడింది.

ఇప్పుడు మహేష్ బాబు కోసం ఓ పాట పాడుతుంది. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలోని ఓ పాటను ఆండ్రియా ఆలపిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాకు తెలిపారు. ‘నేను, దేవిశ్రీ ప్రసాద్‌ స్నేహితులం. ఆయన మహేశ్‌ కోసం కంపోజ్‌ చేస్తున్న ఓ పాటను నేను పాడబోతున్నా. ఇది చాలా మోడ్రన్‌గా ఉంటుంది. సినిమాలోని కీలక సన్నివేశంలో ఈ పాట వస్తుంది. ఈ పాటను పాడాలని చాలా ఉత్సుకతగా ఉంది’ అని ట్వీట్ చేసింది.

loading...