భాగమతి చేయడానికి కారణం అదే : అనుష్క

చాలా రోజుల తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా భాగమతి. యువీ క్రియేషన్ నిర్మాణంలో పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ నెల 26న వస్తుంది. ఇదో హారర్ థ్రిల్లర్. అయితే ఇలాంటి కధలు తనకు ఇష్టం లేదని చెబుతుంది అనుష్క.

థ్రిల్లర్‌ సినిమాలు నాకు అంతగా నచ్చవు. కానీ అలాంటి సినిమానే ఒప్పుకున్నా. ఎందుకంటే కథ బాగా నచ్చింది. చాలా మంది ‘భాగమతి’ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించామని అనుకుంటున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ సినిమాకు ఒప్పుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి యూవీ క్రియేషన్స్‌ నిర్మించడం. రెండోది స్క్రిప్ట్‌ . ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. ఇలాంటి సినిమాలు తెరపై చూసి చూస్తేనే థ్రిల్‌ ఉంటుంది” అని చెప్పుకొచ్చింది స్వీటీ.