డబ్బింగ్ మొదలెట్టేసిన బాలయ్య

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న చిత్రం పైసా వసూల్. పూరి డైరెక్షన్ అంటే సూపర్ ఫాస్ట్ గా ఉటుంది. ఇప్పుడు పైసా వసూల్ కూడా సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జరుగుతోన్న చివరి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 28వ తేదీతో ముగియనుంది. షూటింగ్ చివరిదశలో ఉండగానే .. ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులను మొదలు పెట్టేశారు. హైదరాబాద్ – ప్రసాద్ ల్యాబ్స్ లో పూజా కార్యక్రమాలను నిర్వహించి, ఈ సినిమా యూనిట్ డబ్బింగ్ ను మొదలుపెట్టింది.

Also Read :   కళ్యాణ్ సినిమాలో లాస్య

అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రేయ శరన్, ముస్కాన్ లు ఈ చిత్రంలో హీరోయిన్స్ . దసరా బరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బాలయ్య పూరి లాంటి క్రేజీ కాంబినేషన్లో వస్తున్నఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య డాన్ పాత్రలో కనిపించనున్నారు.