బిగ్ బాస్ లో ‘మైనస్’ వీరేనా..?

ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో నిన్న రాత్రి అట్టహాసంగా మొదలయ్యింది. ఎన్టీఆర్ డాన్స్ , యాకరింగ్ తో మంచి ఊపు వచ్చింది.. సూటేసుకుని, ఎన్టీఆర్ బాగానే అలరించాడు.70 రోజుల పాటు ఆ షో చూడాలంటే యాకరింగ్ చేసే ఎన్టీఆర్ మాత్రమే ఆసక్తి కరం కాదు. పాల్గొనేవాళ్లు కీలకం. పాల్గొనే వాళ్ల చమక్కులు, సరదాలు, హుషారులు అవసరం. అవి ఏమేరకు వుంటే ఆ మేరకు షో క్లిక్ కావాల్సి వుంటుంది. కానీ ఫస్ట్ సీజన్ లో వచ్చిన పార్ట్సప్ట్స్ చూస్తే కాస్త సందేహంగా అనిపిస్తుంది.

Also Read :   ‘ఏజెంట్ భైరవ’ గా వస్తున్న విజయ్

ఎందుకంటే 70 రోజులు ఈ షో కోసం తమ డేట్స్ ఇవ్వాలి కాబట్టి పెద్ద స్టార్స్ ఎవ్వరు కూడా ఈ షో పట్ల ఇంట్రస్ట్ చూపించలేదు. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్నవారిని తీసుకోని వచ్చారు..అర్చన , సింగర్ కల్పనా , కత్తి కల్పన, మధు ప్రియా , ముమైత్ ఖాన్ , సమీర్ , సంపూ , ఆదర్శ్ , ప్రిన్స్ , ధన్ రాజ్ , మహేష్ , జ్యోతి , హరితేజ , శివబాలాజీ వంటి వారు వచ్చారు. వీరంతా కూడా ప్రస్తుతం సినిమాలేవీ లేని స్టార్స్ ..

Also Read :   దేవాసేనకి ఏమైయింది ? ??

ముమైత్ ఖాన్, జ్యోతి ఒకే. సి సెంటర్లలో టీవీ చూసేవారికి కాస్త ఆసక్తి కలిగించవచ్చు. మేల్ పార్టిస్టిపెంట్స్ లో ధనరాజ్, సంపూర్ణేష్ బాబు కాస్త బెటర్. మిగిలిన వారి పట్ల జనాలకు అంత ఆసక్తి వుండదు. సో ఈ నలుగురే బండి లాగించుకు రావాలి. ఎందుకంటే నిత్యం ఎన్టీఆర్ షో లోకనిపించడు కదా? అందువల్ల డైలీ ఈ షో చూడాలంటే ఆసక్తి కరంగా ఎపిసోడ్ లు రన్ కావాలి. మరి ఈ నలుగురితో ఏ రేంజ్ ఆసక్తి వస్తుందా అన్న అనుమానం కలుగుతోంది. మొత్తానికి బిగ్ బాస్ కు నల్గురు మాత్రమే ప్లస్ కాగా మిగతావారంతా మైనస్ అని చెప్పాలి.