స్టేజ్ ఫై కేథరిన్ పరువు తీసిన గోపీచంద్..

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 28న విడుదలవుతుండగా.. ఎస్.ఎస్.తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను నిన్న రాత్రి హైద్రాబాద్ లోని జె.ఆర్.సి కన్వెక్షన్ సెంటర్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

Also Read :   డ్రగ్స్‌ కేసులో సురేష్‌బాబు తనయుడు?

ఈ సందర్భాంగా స్టేజ్ ఫై గోపీచంద్ మాట్లాడుతూ.. చాలాకాలం తర్వాత పూర్తి సంతృప్తిని ఇచ్చిన సినిమాగా తెలిపాడు. దర్శకుడు సంపత్ తనకు ఏదైతే కధ చెప్పారో, దానిని ఆన్ స్క్రీన్ పైకి వందకు వంద శాతం తీసుకువచ్చారని, భవిష్యత్తులో తాను ఎలా ఉన్నా, ఏ సమయంలోనైనా సంపత్ తో సినిమా చేయడానికి సిద్ధమని చెప్పారు.

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే… తమన్నా, హన్సికలు చాలా బాగా చేసారని, వాళ్ళతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వచ్చిందని చెప్పిన గోపీచంద్ కు బ్యాక్ గ్రౌండ్ లో… ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా కాదు, కేథరిన్ అంటూ హింట్ ఇచ్చారు. దీంతో తాను నోరు జారిన విషయం తెలుసుకున్న గోపిచంద్, ‘సారీ’ చెప్తూ… హన్సిక, కేథరిన్ లతో మొదటిసారి చేస్తున్నానని సవరించుకున్నాడు. దీంతో స్టేజ్ ఫై ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా గోపి మాటలు విని నవ్వుకున్నారు.