టీజర్ రివ్యూ: చల్‌ మోహన్‌ రంగ

వర్షాకాలంలో కలుసుకున్న మేము.. శీతాకాలంలో ప్రేమించుకుని.. వేసవికాలంలో విడిపోయాం’ అంటున్నాడు నితిన్‌. ‘లై’ సినిమా తర్వాత కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘చల్‌ మోహన్‌ రంగ’. ఈ టీజర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.

ఈ టీజర్ లో ‘నీ కథేంటి భయ్యా’ అని ఓ వ్యక్తి నితిన్‌ అడగ్గా ‘వర్షాకాలంలో కలుసుకున్న మేము.. శీతాకాలంలో ప్రేమించుకుని.. వేసవికాలంలో విడిపోయాం’ అంటూ సమాధానం ఇస్తే.. ‘మీరిద్దరూ వెదర్‌ రిపోర్టర్సా భయ్యా’ అంటూ అవతలి వ్యక్తి అమాయకంగా ప్రశ్నించడం.. నితిన్‌ తిడుతూ కనిపించడం నవ్వులు పూయిస్తోంది.

Also Read :   జనసేన సభకు పాదయాత్రగా

నితిన్‌ నటిస్తున్న 25వ చిత్రమిది. కుటంబ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా దర్శకుడు కృష్ణ చైతన్య దీన్ని తీర్చిదిద్దుతున్నారు. పీకే క్రియేటివ్‌ వర్క్స్‌, శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ మూల కథను అందించారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Tagged: , , , , ,