ఖైదీ పై మెగా మదర్ ఏమన్నారు ?

chiranjeevi

చిరంజీవి.. వెండితెర రారాజు. డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌ హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని తన సినిమాలతో ఉర్రూతలూగించిన మెగాస్టార్. కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న మెగా హీరో. ఇప్పుడు ఆయన తొమ్మిది సంవత్సరాల తరవాత ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ మళ్లీ వెండితెరపై పై వచ్చారు.

ఈ రోజే ఆయన ఖైదీ నెంబర్ 150సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అభిమానుల, ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు ఆయన కు బెస్ట్ విశేష్ చెప్పారు. సినిమాని చూసి మైమరిచిపోయారు. అయితే ఎవరు ఎంత చెప్పిన అమ్మ మాటలోనే కమ్మదనమే వేరు. మెగా మదర్ అంజనా దేవి తన బిడ్డను ఆశీర్వదించారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఆమె సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తొమ్మిదేళ్ల తర్వాత మా పెద్దబాబునటించిన ఖైదీ సినిమా అద్భుతంగాఉందని, ఇప్పుడు కూడా తన నటన, డ్యాన్సులతో అద్భుతమైన వినోదం పంచాడని, అభిమానులందరికి కృతజ్ఞతలని ఆనందం వ్యక్తం చేశారు అంజనాదేవి.