సెకండ్ వీక్ లో మెగా జోష్ చూడబోతున్నాం..

chiru-meelo

మెగాస్టార్ గా వెండి తెర ఫై ఓ వెలుగు వెలిగిన చిరంజీవి , తాజాగా బుల్లితెర ఫై మెగా మెరుపులు మెరిపిస్తున్నాడు. మా టీవీ లో ప్రసారం అవుతున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే..ఈ నెల 13 నుండి ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. సోమవారం నుండి గురువారం వరకు ప్రసారం అయినా మొదటి ఎపిసోడ్ ఆ స్థాయి లో ప్రేక్షకులను అలరించలేకపోయిందని ఫీడ్ బ్యాక్ రావడం తో , యాజమాన్యం వెంటనే సెకండ్ ఎపిసోడ్ ఫై జోష్ పెంచారు.

వచ్చేవారం సెలబ్రిటీల హంగామా మొదలు కాబోతుంది . ఆల్రెడీ నాగార్జున, ప్రగ్యాజైస్వాల్‌ నిన్నటి షోలో కన్పించడంతో నిన్న బుల్లితెర ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసారు. దీంతో వచ్చే వారమంతా సెలబ్రిటీలతో నింపబోతున్నారు . ఒకప్పుడు చిరు తో చిందులేసిన రాధిక, సుహాసిని షో కు వచ్చి , మరింత గ్లామర్ ను తీసుకోరబోతున్నారు. అంతే కాదు యాంగ్ హీరోలైన రాణా, సాయిధరమ్‌ తేజ వంటి స్టార్స్ కూడా రాబోతున్నారని సమాచారం. మొత్తానికి చిరు షో కు మరింత సినీ గ్లామర్ తీసుకొచ్చి భారీగా టిఆర్పి రేటింగ్ ఫై కన్నేసినట్లు తెలుస్తుంది.