ఖైదీ కోసం దిల్ రాజు సినిమాను వదులుకున్నాడు..

raju-tyagam

టైటిల్ చూసి దిల్ రాజు నిర్మించిన ‘ శతమానం భవతి ‘ జనవరి 14 న రిలీజ్ కావడం లేదా అని ఖంగారు పడకండి..అసలు స్టోరీ చూస్తే మీకే అర్ధం అవుతుంది..’ బాస్ ఇస్ బ్యాక్ ‘ అంటూ మెగా స్టార్ మాములుగా రాలేదు.బాక్స్ ఆఫీస్ ఫై ఒక్కసారిగా చిరుత పులి లా పడ్డాడు..బాస్ ఎంట్రీ తో మళ్లీ బాక్స్ ఆఫీస్ కు పూర్వ వైభవం వచ్చింది..విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడం తో , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ కొంత ఖైదీ కోసం త్యాగం చేసాడని సమాచారం.

khaidi-premire-talk

శర్వానంద్ , అనుపమ జంటగా దిల్ రాజు నిర్మించిన ‘ శతమానం భవతి ‘ సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. పండుగ సీజన్ లో కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్ కు వస్తారని తన పరిధి మేరకు తన సినిమాకు థియేటర్స్ ను బుక్ చేసుకున్నాడు. కాగా ఖైదీ కోసం తన వద్ద ఉన్న వాటి నుంచి ఓ 20 థియేటర్లను త్యాగం చేశాడట. నిర్మాత అల్లు అరవింద్ , దిల్ రాజు లు చాల సేపు భేటీ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి అల్లు అరవింద్ ఎలా రాజు ను ఒప్పించాడో ..ఆ లెక్కలు ఏంటో వారికీ తెలియాలి..