సెభాష్‌.. శ్రుతి

shruthi-hasanజ్యూసు గ్లాసు తీసుకురావ‌డం ఆల‌స్యమైతే అలిగి షూటింగ్‌ కి డుమ్మా కొట్టే క‌థానాయిక‌లున్నారు. త‌ల‌నొప్పి, కాలు నొప్పి అంటూ సాకులు చెప్పి చెప్పాపెట్టకుండా మానేసే వాళ్లూ ఉన్నారు. వీరంద‌రి మ‌ధ్య శ్రుతిహాస‌న్ త‌న ప్రత్యేక‌త చాటుకొంటోంది. ప్రస్తుతం శ్రుతిహాస‌న్ ‘రేసుగుర్రం’ సినిమాలో న‌టిస్తోంది. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడు. ఈ సినిమా షూటింగ్ స్విర్జర్లాండ్‌ లో తీస్తున్నారు. అక్కడ బన్నీ, శ్రుతిల‌పై ఓ గీతాన్ని తెర‌కెక్కిస్తున్నారు. స్విస్ వాతావ‌ర‌ణం శ్రుతికి ఏమాత్రం ప‌డ‌లేదు. లాండ్ అవ్వడానే.. జ్వరం వ‌చ్చేసింది. అంత జ్వరంలోనూ శ్రుతి షూటింగ్‌ లో పాల్గొంద‌ట‌. నా వ‌ల్ల‌.. ఎవ‌రికీ ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌దు.. అంటూ ఒళ్లు కాలిపోతున్నా బ‌న్నీతో క‌లిసి స్టెప్పులు వేసింద‌ట‌. సినిమా ప‌ట్ల శ్రుతికి ఉన్న అంకిత‌భావానికి.. చిత్రబృందం నివ్వెర‌పోయింది. తండ్రికి త‌గ్గ కూతురు అనిపించుకోవాలంటే.. ఇలాంటి సాహ‌సాలు చేయ‌డం త‌ప్పదు మరి.