భావన కేసు : కమల్ కామెంట్స్ పై గౌతమి రియాక్షన్

నటి భావనను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి లైగింక దాడికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు పై కమల్ హాసన్ స్పందిస్తూ.. ”ఆమె సాధారణ వ్యక్తా, హీరోయినా నా అన్నది ముఖ్యం కాదు. మహిళలను కాపాడటం నాతోపాటు ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ఆ నటి పేరును దాచిపెట్టకండి. ఆమె పేరును పేర్కొనడంలో తప్పేమీ లేదు” అని వ్యాఖ్యానించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. బాదితురాలి పేరు చెప్పడం చట్ట విరుద్దమని, అమ్మాయి మనోభావలు గురించి అలోచించాలని, ఈ విషయంలో కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలి కొందరు డిమాండ్ చేశారు.

Also Read :   జయప్రద ‘సువర్ణ సుందరి’

తాజాగా ఈ విషయం పై గౌతమీ స్పదించింది. ” బాధితురాలి పేరు దాచకూడదు. కానీ అందుకు చట్టం ఒప్పుకోదు. నాకు బాధితురాలు అన్న పదం వాడటానికి సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఓ అమ్మాయి ఇలాంటి దారుణ ఘటనల్ని ఎదుర్కొని తనకు న్యాయం కావాలని పోరాడుతున్నప్పుడు ఆమె పేరు దాచాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో ఆమె ఓ హీరో.” అని చెప్పుకొచ్చింది గౌతమీ.

loading...