గురు – ‘ఓ సక్కానోడా’ సాంగ్ రిలీజ్

guru-osakkanoda
తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా సుధా కొంగర దర్శకత్వం వహించిన “గురు” చిత్రం లో బాక్సింగ్ కోచ్ పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించనున్నాడు.

స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఉండే ఈ స్పోర్ట్స్ డ్రామా ను వేసవి సెలవుల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భాంగా చిత్ర యూనిట్ మూవీ లోని “ఏయ్ సక్కనోడా ” పాట లిరికల్ వీడియో ను విడుదల చేసారు.

” మణి రత్నం తో పని చేసి, మిత్ర్ సినిమా తో నేషనల్ అవార్డు దక్కించుకున్న సుధా కొంగర ఈ చిత్రాన్ని మలచిన తీరు అద్భుతం అంటున్నారు చిత్ర యూనిట్. వెంకటేష్ ను ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త లుక్ లో ప్రెసెంట్ చేశారట. మంచి ఎమోషన్స్ తో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తుంది.

guru-summar

రితిక సింగ్, ముంతాజ్ సర్కార్ లు ఈ చిత్రం లో వెంకటేష్ తో పాటు ప్రధాన పాత్రలను పోషిస్తారు. రితిక సింగ్ ఇటీవలే ఉత్తమ నటి క్యాటగిరి లో నేషనల్ అవార్డు ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ముంతాజ్ సర్కార్ విషయానికి వస్తే, ఆమె సుప్రసిద్ధ మాంత్రికులు పి . సి. సర్కార్ కుమార్తె.

గురు చిత్రం ఆడియో ను మర్చి మొదటి వరం లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణ్ గతం లో “కబాలి”, “భైరవా” వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఇక మీరు కూడా ‘ఓ సక్కానోడా’ సాంగ్ ఫై లుక్ వెయ్యండి.