జూనియర్.. భలే ముద్దుగా వున్నాడు


జూనియర్ ఎన్టీఆర్ కి సంబధించిన ఒక అరుదైన ఫోటో నెట్ లో దర్శనమిచ్చింది. ఎన్టీఆర్‌ చిన్నతనంలో దిగిన ఈ ఫొటో ఇది. బుజ్జి తారక్‌ తన తల్లి శాలిని పక్కన ఎంత అమాయకంగా నిల్చొని చూస్తున్నారు ఇందులో. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అభిమానులు ఈ అరుదైన ఫొటోను షేర్‌ చేస్తున్నారు.

ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు తారక్. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. దీని తర్వాత ఎన్టీఆర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌ ‘#RRR’)లో నటించనున్నారు.