కాజల్ .. జయలలిత కాదు

విశ్వ విఖ్యాత నట స్వారభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. తేజ దర్శకుడు. బ్రహ్మతేజ ప్రొడక్షన్స్‌ పతాకంపై బాలకృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రామకృష్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్‌ ఘనంగా ప్రారంభమైంది.

కాగా ఇందులో కాజల్‌ అలనాటి తార జయలలిత పాత్రలో నటించనున్నారని ఇటీవల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, తను జయలలిత పాత్రను పోషించడం లేదని కాజల్ తాజాగా స్పష్టం చేసింది.

Also Read :   భరత్ ఫస్ట్ సాంగ్ టాక్ ..

కాగ హీరో రానా.. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో, బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో, బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె.. శ్రీదేవి పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సివుంది.