హీరోయిన్‌గా కట్టప్ప కూతురు

divya satya rajతమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగులో కూడా పలు పాత్రలతో ఆకట్టుకున్న నటుడు సత్యరాజ్‌. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్న కట్టప్పకు ఏ ముహూర్తాన రాజమౌళి కట్టప్ప పాత్రను ఇచ్చాడో అప్పటి నుండి సత్యరాజ్‌ కాస్త కట్టప్ప అయ్యింది. సత్యరాజ్‌ అంటే కొందరు గుర్తు పట్టరేమో కాని కట్టప్ప అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తు పట్టడం ఖాయం. అంతటి క్రేజ్‌ వచ్చిన సత్యరాజ్‌కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.

కుమారుడు ఇప్పటికే తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక కూతురు దివ్య సుబ్బయ్య. ఈమెకు నటనపై ఆసక్తి ఉందట. అందుకే ఇప్పటికే పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లలో నటించి తన నటన ప్రతిభను కనబర్చుతూ వచ్చింది. తాజాగా ఈమె వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా విశ్వసనీయ సమాచాం ద్వారా తెలుస్తోంది. ఈమె తండ్రి సత్యరాజ్‌కు కట్టప్పగా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ రావడంతో ఆ క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని దివ్య భావిస్తుంది. అందుకోసం ఆమె ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. కట్టప్ప కూతురు దివ్య సినిమాల్లో రాణిస్తుందా అనేది చూడాలి.