రజనీ తో ఖుష్బూ

rajani

ప్రస్తుతం రోబో 2.oతో బిజీగా వున్నారు రజనీ కాంత్. ఈ సినిమా తర్వాత పా రంజిత్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా దీపిక పదుకొణెను తీసుకోవాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో మరో నటీమణి చేరింది . సినియర్ నటి ఖుష్భూ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తారని టాక్. ఖుష్బూ 1988లో రజనీతో కలిసి ‘ధర్మతిన్‌ తలైవన్‌’ లో నటించారు. తర్వాత ఎప్పుడూ జోడికట్టలేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత రజనీ సినిమాలో నటించడం విశేషం.

ఈ సినిమా విషయానిని వస్తే.. రజనీ అల్లుడు ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మేలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ రోబో ‘2.0’తో బిజీగా వున్నారు. రోబోకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం పై బోలెడు అంచనాలు వున్నాయి.