సంక్రాంతి పోటి పై నాగార్జున కామెంట్

nagarjuna (16)

ఈ పండగ బడా సినిమాలతో హోరెక్కిపోనుంది. చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. చిరంజీవి ఖైదీ నెం.150, బాల‌కృష్ణ గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ఱి.. రెండూ ప్రతిష్టాత్మక చిత్రాలే. చిరు 150వ సినిమా, అలాగే ఆయన రీఎంట్రీ సినిమా. బాల‌య్యకు ఇది సెంచరీ. ఈ రోజు ఖైదీ వచ్చేసింది. రేపు బాలకృష్ణ సినిమా. దీంతో పోటి ఆసక్తికరంగా మారింది.

అయితే బాలయ్య-చిరులు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. మొన్న మెగా ఈవెంట్ లో చిరంజీవి, బాలయ్య కి అల్ ది బెస్ట్ చెబితే.. తర్వాత రోజే ఓ ప్రమోషన్ ఈవెంట్ లో మాట్లాడిన బాలయ్య,.. చిరు సినిమాకి బెస్ట్ అఫ్ లక్ చెప్పారు. అయితే ఇవి నామమాత్రమే అని చెప్పాలి. ఎంత అనుకున్నా ఏమనుకున్నా ఈ రెండు సినిమాల మధ్య పోటి అనివార్యం అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు.

ఈ నేపధ్యంలో ఇండస్ట్రీ జనాలు వీటిపై చాలా బ్యాలన్స్ గా స్పందిస్తున్నారు. తాజాగా నాగార్జున ఈ రెండు సినిమాలపై స్పందించారు. ‘బాలయ్య.. క్రిష్ అండ్ టీమ్ కు.. ఆల్ ది బెస్ట్. నాకు హిస్టారికల్ సినిమాలంటే ఇష్టం. అందుకే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి హిస్టరీ క్రియేట్ చేయాలని అనుకుంటున్నా.’అని ట్వీట్ చేశారు. అలాగే చిరంజీవి సినిమాపై ట్వీట్ చేస్తూ.. మెగాస్టార్ కి వెల్ కం. ఖైదీ నెంబర్ 150మీ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేశారు నాగ్.