‘బంగార్రాజు’.. ఇప్పట్లో లేదు

నాగార్జున ప్రస్తుతం ‘రాజుగారి గది2’తో బిజీగా వున్నారు. ఈ సినిమా చివరిదశకు వచ్చినా తన కొత్త చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు నాగార్జున.కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చిత్రం చేయాల్సి ఉన్నా, ఆ సినిమాకి సంబంధించి ఇంకా పక్కాగా స్క్రిప్టు సిద్ధం కాలేదు. సో అది పోస్ట్ పోన్ అయ్యింది.

అయితే ఓ కొత్త దర్శకుడికి ఆయన అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ‘ఉయ్యాలా జంపాలా’తో మెప్పించి ‘మజ్ను’తో తన సత్తా చాటుకున్న విరించి వర్మ. ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’కి నిర్మాత నాగార్జునే. ఆ పరిచయంతోనే ఆయన ఇటీవల నాగ్ కి ఒక లైన్ చెప్పడం, ఆయన ఓకే చెప్పడంతో .. పూర్తిస్థాయి కథపై విరించి వర్మ కసరత్తు చేస్తున్నాడు వర్మ. ఈ సినిమా నాగార్జున స్వయంగా నిర్మిస్తారని సమాచారం. త్వరలోనే దీనిపై ప్రకటన రానుంది.