మా సత్తా చూడమంటున్న నందమూరి ఫాన్స్

nandhamuri-fans-hungama

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఖైదీ నెం 150 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..బాస్ ఇస్ బ్యాక్ అంటూ మెగా స్టార్ చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.. అభిమానులు అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా అదరగొట్టింది..9 ఏళ్ల ఎదురుచూపులు ఒక్క దెబ్బ తో తేలిపోయింది..

ఇక నందమూరి అభిమానుల జోరు మొదలయ్యింది.. బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తో రావడం , అది కూడా సంక్రాంతి బరిలో నిలవడం తో నందమూరి అభిమానుల సంబరాలు మాములుగా లేవు..ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో బాలయ్య అభిమానుల హుషార్ స్టార్ట్ అయ్యింది. అన్ని ఏరియాల్లో అన్ని థియేటర్స్ ను ముస్తాబు చేసే పనిలో పడ్డారు. ఇక హిందూపురంలో అయితే అభిమానుల సంబరాలు మాములుగా లేవు.

gps-redy

హిందూపురంలోని ఓ థియేటర్ ని బాలయ్య అభిమానులు అత్యంత సుందరంగా అలంకరించారు. థియేటర్ చుట్టు దండలు -, మెరుపులు -, రకరకాల స్టిల్స్ తో బాలయ్య -, నందమూరి తారకరామారావు కటౌట్లతో ముస్తాబు చేశారు. ఇక అర్ధరాత్రి నుండే చాల చోట్ల బినిఫిట్ షోస్ పడనుండడం తో సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ టెన్షన్ లో ఉన్నారు.