పద్మావతి పై ఎమర్జెన్సీ మీటింగ్

సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి ఎన్నో వివాదాలు ఎదుర్కొని ఎట్టకేలకు 25న విడుదలకు నోచుకుంటోంది. సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్‌ ఇచ్చినప్పటికీ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు సినిమా విడుదలపై నిషేధం విధించాయి. అయితే సుప్రీం కోర్టు తాజాగా దీనిపై తీర్పు నిస్తుంది విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాగా ఈ నేపధ్యంలో రాజ్‌పుత్ రాణి గురించి అవాస్త‌వాల‌ను తెర‌కెక్కించార‌ని ఆరోప‌ణ‌లు చేస్తోన్న రాజ‌్‌పుత్ కర్ణిసేనలు అలర్ట్ అయ్యారు. రాజ్‌పుత్ కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఎవ్వరూ వెళ్లకూడదని, అలాగే థియేటర్ యాజమాన్యాలు ఈ సినిమాను ప్రదర్శించకూడదని , తమకు సామాజిక సంస్థలు సహకరించాలని, ఈ సినిమా విడుదల కాకుండా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దినిపై ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టారు