పవన్ కళ్యాణ్.. ఎవరికి ఓటేస్తాడో .. ?

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా చేయబోతున్నారా ? అవుననే వినిపిస్తుంది. కొత్త సినిమాలో నటించడానికి ఆయన కాస్త సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇంతకాలం పాటు సినిమాలు చేస్తానని తాను అనుకోలేదనీ.. అభిమానులను నిరుత్సాహపరచడం ఇష్టం లేకనే తాను సినిమాలను కంటిన్యూ చేస్తూ వస్తున్నానని చాలా సందర్భాల్లో పవన్ చెబుతూ వస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం ఆయన సినిమాలు చేయడం మానుకోకూడదనే భావిస్తున్నారు. అయితే ఈ మధ్య పాలిటిక్స్ లో బాగా బిజీ అయిపోయిన పవన్ మళ్ళీ సినిమాలో కనిపించే ఛాన్స్ వుండదని అనుకున్నారు.

Also Read :   పవన్ కళ్యాణ్ తో మహేష్ సిస్టర్

అయితే ఆయన కొత్త సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎ.ఎమ్‌.రత్నం నిర్మాణంలో పవన్‌ ఓ సినిమా చేయడానికి ఇదివరకే అంగీకరించారు. నేసన్‌ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రానికి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు తెరపైకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకుడిగా పవన్‌ సినిమా తెరకెక్కబోతోందని ప్రచారం జరుగుతుంది. ఈ రెండిట్లో ఒక సినిమాని ఆయన సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఛాన్స్ వుందని టాక్.

Tagged: , , ,