శివ‌మెత్తిన ప‌వ‌న్‌…

Pawan-Kalyanప‌వ‌న్ క‌ల్యాణ్ సాధార‌ణంగా మాట్లాడ‌డు. ఎవ‌రినీ వేలెత్తి చూపించ‌డు. వేదిక‌ల‌పై కోపంతో ఊగిపోవ‌డం.. సంచ‌ల‌నాల కోసం ఏదో ఒక‌టి వాగేయ‌డం తెలియ‌ని మ‌నిషి. అలాంటి వ‌ప‌న్ శివ‌మెత్తాడు. ఎప్పుడూ నిమిషంలోపే త‌న ప్రసంగం ముగించే వ‌ప‌న్ తొలిసారి ఐదు… ప‌ది.. ప‌దిహేను. ఇర‌వై – ఇలా ఏకంగా అర‌గంట ఏక‌ధాటిగా మాట్లాడాడు. ఎవ్వరినీ వ‌ద‌ల‌ను – తాట తీస్తా.. అంటూ పెద్ద పెద్ద ప‌దాల‌ను ప్రయోగించాడు. అత్తారింటికి దారేది విజ‌యోత్సవ స‌భ‌లో చోటుచేసుకొన్న ప‌రిణామాలివి. ప‌వ‌న్ ప్రసంగం మామూలుగా.. ప్రశాంతంగా మొద‌లైంది. ఈ సినిమాకోసం క‌ష్టప‌డిన వారంద‌రికీ పేరు పేరునా అభినంద‌న‌లు చెప్పాడు. చివ‌రికి టాపిక్ పైర‌సీ ద‌గ్గర‌కు వ‌చ్చింది. అక్కడ ఇక ప‌వ‌న్‌కి ఆప‌డం ఎవ‌రి త‌రం కాలేదు. చినుకుగా మొద‌లైన అత‌ని ప్రసంగం తుఫాన్‌లా మారింది. సునామీలా విరుచుకుప‌డ్డాడు. ”ఇది ఇంటి దొంగ‌ల ప‌నే. ఎవ‌రు చేశారో, ఎవ‌రు చేయించారో నాకు తెలుసు. నేను ఎవ‌రి జోలీకి వెళ్లను. స‌హ‌నం ఎక్కువ‌. నా ప‌ని నేను చేసుకొంటూ పోతా. అలాంటి న‌న్ను కెలికారు. పైర‌సీ విష‌యంలో పైకి క‌నిపిస్తున్న పేర్లు కొన్నే. కానీ వాటి వెనుక చాలామంది ప్రమేయం ఉంది. ప‌రిశ్రమ అన్నం తింటున్న వాళ్లే ఈ ప‌నికి పాల్పడ్డారు. నా సినిమాలే ఆడాలి, ప‌రిశ్రమ‌లో నేనే ఉండాలి అనుకొనే వ్యక్తిని కాను నేను. నా సినిమా ఒక్క రోజే. ఇంకా 365 రోజులు మీ సినిమా ఆడించుకోండి. సినిమా బాగా ఆడేసింది క‌దా, హిట్ అయ్యింది క‌దా, వంద కోట్లు వ‌చ్చాయి క‌దా, అనుకోండి. ఇంత‌టితో అయిపోలేదు. ఇంకా ఉంది. వారంద‌రినీ మీ ముందు నిల‌బెడ‌తా. తాట తీస్తా. ఒక్కరినీ వ‌ద‌ల‌ను. త్రివిక్రమ్ మూడేళ్లు క‌ష్టప‌డి రాసుకొన్న క‌థ ఇది. అర‌గంట‌లో నాశ‌నం చేసేశారు. పైర‌సీ బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. కొంత‌మంది నాకు ఫోన్ చేశారు. వాళ్లంతా ప‌రిశ్రమ పెద్దలే ‘సినిమా బాగుంది. పైర‌సీ దీన్ని ఆప‌లేదు..’ అన్నారు. గోరు చుట్టుపై రోక‌లి పోటులా అనిపించింది. నారక్తం మ‌రిగిపోయింది. వాళ్లెవ్వరినీ వ‌దిలిపెట్టను. ఇది కుట్ర‌. ఎవ‌రో ఉద్దేశ‌పూర్వకంగానే చేశారు….” అంటూ అన‌ర్గళంగా, ఆవేశంగా మాట్లాడారు ప‌వ‌న్‌. ఇంత‌కీ ప‌వ‌న్ ఎవ‌రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? ఈ కుట్ర వెనుక ఎవ‌రున్నారు? పైర‌సీ జ‌ర‌గ‌డానికి కార‌ణం ఎవ‌రు? ఈ అంశాల‌పై ఇప్పుడు జోరుగా చ‌ర్చసాగుతోంది. మొత్తమ్మీద మీడియాకు కావ‌ల్సినంత మ‌సాలా అందించాడు ప‌వ‌న్‌. ఇక మీడియాలో పైర‌సీ మ‌రో రూపంలో హోరెత్తిపోవ‌డం ఖాయం.

Tags : Pawan Kalyan sensational comments in AD thank you meet, pavan kalyan sensational comments in AD success meet, pavan kalyan firing comments in attarintiki daredi thank you function, attarintiki daredi success function power star sensational speech