ఫస్ట్ లుక్ : సాక్ష్యం

బెల్లంకొండ శ్రీనివాస్‌, పూజా హెగ్దే జంటగా ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీవాస్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైటిల్ ‘సాక్ష్యం అభిషేక్ నామా నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ జరుపుకుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

హీరో హీరోయిన్స్ ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ .. మనసులోని ప్రేమను మౌనంగా ఆవిష్కరిస్తున్నట్టుగా ఈ పోస్టర్ వుంది. ఫారిన్ నేపథ్యంలో ఈ కథ ఎక్కువగా కొనసాగుతుందనే విషయం ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ .. శరత్ కుమార్ .. రవికిషన్ .. ఈ సినిమాలో కీలక పాత్ర దారులు. ఇటీవలే జయజానకి నాయక సినిమాతో ఆకట్టుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. బాలకృష్ణ డిక్టేటర్ తర్వాత శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. డిజె తో ఒక సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే .. కలయికలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే వున్నాయి.

Tagged: ,