అక్టోబర్ లో మాస్ రాజా సందడి..

మాస్ మహారాజ రవితేజ నుండి ‘బెంగాల్ టైగర్’ మూవీ తర్వాత ఒక్క సినిమా కూడా రాకపోయేసరికి ఏడాదిన్నరగా అభిమానులు ఎంతగానో నిరాశ చెందుతున్నారు..ఇలాంటి తరుణం లో ఒకేసారి రవితేజ రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చి వారి ఆతృతను కాస్త సంతృప్తి ఇచ్చాడు.. వాటిలో ఒకటి టచ్ చేసి చూడు , మరోటి ‘రాజా ది గ్రేట్’.

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న రాజా ది గ్రేట్ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇంకో 30శాతం మాత్రమే చిత్రీకరణ మిగిలి ఉన్నట్లు సమాచారం..ఇందులో రవి తేజ చూపులేని వ్యక్తిగా నటించనున్న సంగతి తెల్సిందే..తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేయాలనే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ చేస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకుల్ని తప్పక అలరిస్తుందని చిత్ర టీమ్ భావిస్తోంది. మరోవైపు ఏడాదిన్నరగా రవితేజ నుండి సినిమాలు రాకపోయేసరికి ఈ మూవీ ఫై భారీ గా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడం రాజా సక్సెస్ అవుతాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.