డిజిటల్ బాషా వచ్చేస్తున్నాడు

rajani

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘బాషా’ ఓ సంచలనం. ఓ ట్రెండ్ సెట్టర్. బాషాలో రజనీ చెప్పిన ‘ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పిన‌ట్లు’ డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తుంటుంది. తెలుగులో రజినీకాంత్ ను స్టార్ హీరో సినిమా ఇది.

కాగ, బాషా సీక్వెల్ ని తీసుకురావాలని దర్శకుడు సురేష్ కృష్ణ ఆ మధ్య ప్రయత్నాలు చేశారు. తర్వాత ఎందుకు కుదరలేదు. ఐతే ఇప్పుడీ చిత్రాన్ని డిజిట‌లైజ్ చేసి మళ్లీ రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు.

డిజిటలైజ్ చేసి.. 5.1 సరౌండ్ సౌండ్ తో మళ్లీ ఈ చిత్రని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచినా బాషా.. ఇప్పుడు డిజిటల్ వెర్షన్ లోనూ సెన్సేషన్ సృష్టిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. మార్చి 3న డిజిటల్ బాషా తమిళ్ వెర్షన్ ను రిలజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు చెప్పారు.