అభిమాని మృతిపై చరణ్ దిగ్భ్రాంతి


తన అభిమాని చిన్నారి పరశురామ్‌ మృతిపట్ల హీరో రామ్‌చరణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మగధీర’ సినిమాలోని డైలాగ్‌లను అలవోకగా చెప్పి రామ్ చరణ్ దృష్టిని ఆకర్షించాడు మహబూబ్‌నగర్‌ జిల్లావాసి అయిన పరశురామ్‌.

అప్పట్లో అతడి డైలాగ్‌ వీడియోలు సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. బాలుడు డైలాగ్‌ చెబుతున్న తీరును చూసిన రామ్‌చరణ్‌ తన ఇంటికి పిలిపించుకుని సరదాగా కాసేపు ముచ్చటించాడు. చదువుకోమని చెప్పి, అతడికి టీషర్ట్‌ కూడా కానుకగా ఇచ్చి, ఆర్ధిక సాయం చేస్తానని కూడా మాట ఇచ్చాడు చరణ్. అయితే ఇటీవల పరశురామ్‌ అనారోగ్యంతో కన్నుమూశాడు.

Also Read :   మెగా స్టార్ మాట కాదని రంగ స్థలం

ఈ విషయం తెలుసుకున్న రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా సంతాపం తెలిపాడు. పరశురాం ఇకలేరని తెలిసి షాక్‌ అయ్యానని, తీవ్రంగా బాధపడ్డానని, అతడి లోటును మాటల్లో వివరించలేనని ఇలాంటి కష్ట సమయంలో ఆ కుటుంబానికి పూర్తి ప్రేమ అందుతుందని ఆశిస్తున్నట్లు, సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరాడు చరణ్.

Tagged: , , , ,