ఖబడ్దార్ పవన్ కల్యాణ్

ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో ఈరోజు రాత్రి దాడి చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కారు దిగిన వెంటనే ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం.

కాగా ఈ దాడిని ఓయూ జేఏసీకి చెందిన రవి ఖడించారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడమనేది అనాగరికమని మండిపడ్డారు. ఈ దాడిని తాము ఖండిస్తున్నామని అన్నారు. పవన్ కల్యాణ్ తన అభిమానులకు మాట మాత్రం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు.‘ఖబడ్దార్ పవన్ కల్యాణ్.. తెలంగాణలో నిన్ను తిరగనివ్వం. అభిమానులకు చెప్పుకోలేని మూగవాడివి. నీ అభిమానులతో కత్తి మహేశ్ పై దాడి చేయిస్తావా?’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.