‘పద్మావతి’తో సంజు

sanjay
గత ఏడాది సంజయ్ దత్ జైలు జీవితం విముక్తిపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన సినీ జీవితంపై మళ్ళీ ఫోకస్ చేయబోతున్నాడు సంజయ్. ఇందులో బాగంగా ఓ భారీ సినిమాలో బాగం కాబోతున్నాడు సంజయ్.

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పద్మావతి’. దీపిక పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా సంజయ్‌ దత్‌ కూడా ఈ సినిమా లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసింది.

ఇదీలావుంటే .. సంజ‌య్‌ద‌త్ జీవిత క‌థ ఇప్పుడు వెండి తెర‌పై ఆవిష్కరించ‌డానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాజ్‌కుమార్ హిరాణీ ఈ సినిమాని రూపొందించనున్నారు.స్క్రిప్ట్ పనులు తుది దశకు వచ్చాయి. ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో రన్బీర్ కపూర్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఓకే అయ్యింది. సంజయ్ భార్య మాన్యత దత్ పాత్రలో సోనమ్ కపూర్ నటించే ఛాన్స్ వుంది.