శ్రియా… మళ్ళీ మరోసారి


శ్రియా ఇండస్ట్రీకి పదిహేనేళ్ళు అయ్యింది. ఇప్పుడు ఆమె జోరు తగ్గింది కానీ.. ఒకప్పుడు టాప్ హీరోయిన్. చిరంజీవి,రజనీకాంత్, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్..ప్రభాస్.. ఇలా టాప్ హీరోలందరితోనూ జతకట్టింది అమ్మడు. అయితే కొత్త హీరోయిన్స్ రాకతో ఆమె జోరు తగ్గింది. అయితే బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో మరోసారి సోలో హీరోయిన్ గా అదరగొట్టింది. ఇందులో వశిష్టీ దేవిగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది శ్రియా.
శాతకర్ణిలో శ్రియ అద్భత నటనకు ఇంప్రెస్ అయిన బాలయ్య మరోసారి పైసా వసూల్ చేశాడు. ఇప్పుడు శ్రియాకు మళ్ళీ అవకాశాలు అందుతున్నాయి

Also Read :   ఏప్రిల్ లో మహేష్ కొత్త చిత్రం...

ఇటివలే గాయత్రితో వచ్చింది. ఇప్పుడు ఆమెకు మరో అవకాశం దక్కింది. తేజ .. వెంకటేశ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంతో కూడిన ఈ సినిమా, త్వరలో రెగ్యులర్ షూటింగును మొదలెట్టనుంది. . ఈ సినిమాలో కథానాయికగా అదితీరావు హైదరీని అనుకున్నారు.కాని ఇప్పుడు శ్రియ కరెక్ట్ అని ఫీలౌతున్నారు. గతంలో వెంకటేశ్ .. శ్రియ కలిసి ‘సుభాశ్ చంద్రబోస్’ .. ‘గోపాల గోపాల’ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది హ్యాట్రిక్.

Tagged: , ,