ఓపెన్ గా సారీ చెప్పిన తాప్సీ

హీరోయన్ తాప్సి , దర్శకుడు రాఘవేంద్రరావుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పింది. తను చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు కోరింది. ‘ఝుమ్మందినాదం’ చిత్రంతో రాఘవేంద్రరావు తాప్సిని కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే ఝుమ్మంది నాదం’ సినిమా షూటింగులో రాఘవేంద్రరావు సినిమాపై కాకుండా తన బొడ్డుపై కొబ్బరికాయ, పూలు విసరడం మీదే దృష్టిపెట్టాడు అంటూ ఓపెన్ కామెంట్ చేసి విమర్శ పాలైయింది తాప్సీ.

అయితే వివాదం ఇంకా ముదరడంతో పేస్ బుక్ ద్వారా క్షమాపణలు కోరింది. తన సినీ ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వారిని బాధించడం తన ఉద్దేశం కాదు. సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి రాఘవేంద్రరావు కారణం. తాను చేసిన వ్యాఖ్యలు రాఘవేంద్రరావు గురించి కాదని, తన గురించని, కేవలం నాపై ఏను జోక్ చేసుకున్నాని, ఈ క్రమంలో పొరపాటున ఎవరినైనా బాధించి ఉంటే నిజంగా క్షమించండని ఓ వీడియో ద్వారా తెలిపింది తాప్సి.