బాలయ్యకు ఈ టైటిల్ నచ్చుతుందా ?

balayya

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. పూరి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తొలుత ఓ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి ఓ వెరైటీ టైటిల్ వినిపిస్తుంది.
సహజంగాసినిమాల పేర్లు చాలా వెరైటీగా వుంటాయి. ఇప్పుడు బాలకృష్ణ చిత్రానికి ఓ వెరైటీ టైటిల్ అనుకుంటున్నాడట. అదే “టపోరి”.

అయితే ఈ టైటిల్ ను ఇంకా బాలయ్య కు చెప్పలేదు. జనరల్ గా బాలయ్య కు ఇలాంటి టైటిల్స్ నచ్చావు. ఆయన టైటిల్స్ కాస్త హుందాగా వుంటాయి. మరి ఇప్పుడు పూరి చెబుతున్న టైటిల్ ఆయనకు నచ్చుతుందో లేదో చూడాలి. భవ్య ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్స్ ఇంకా ఖరారు కాలేదు.