జుట్టు దానం చేసిన హీరో భార్య

హీరో వరుణ్‌ సందేశ్‌ భార్య వితికా షెరు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారని వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఆమె తేల్చి చెప్పారు. ఇప్పుడు ఆమె క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం జత్తును దానం చేశారు.

ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ ద్వారా తెలుపుతూ.. పార్లర్‌లో కురులు కత్తిరిస్తుండగా తీసిన వీడియోను పోస్ట్‌ చేశారు. చెన్నైలోని క్యాన్సర్‌ సంస్థ ఆడ్యార్‌కు తన శిరోజాలను డొనేట్‌ చేసినట్లు వెల్లడించారు. డబ్బులు, ఆహారం విరాళంగా ఇవ్వడం కన్నా.. ఏళ్ల తరబడి పెంచుకున్న, ఎంతో ఇష్టమైన పొడవైన జట్టును కత్తిరించి ఇవ్వడం కొంచెం కష్టమైన పని అని చెప్పుకొచ్చారు. ఈసారి హెయిర్‌ కట్‌ చేయించుకోవాలి అనుకున్నప్పుడు.. మీ వంతు సాయం చేయండని కోరింది వితిక.

Also Read :   మెగాస్టార్ పై హరీష్ కన్ను

పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన 2016లో ఆమె వరుణ్‌ సందేశ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె వరుణ్ తో హైదరబాద్ లోనే వుంటున్నారు.