షాకింగ్ : అసలు డ్రగ్స్ కి అడ్డా స్కూల్స్

టాలీవుడ్ డ్రగ్స్ డొంక కదిలింది. ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం 15మందికి నోటీసులు అందాయి. ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద వీళ్లందరికీ నోటీసులు ఇచ్చారు పోలీసులు. కొందమంది సినీ ప్రముఖులు దీనిపై ఇప్పటికే స్పందించారు. ఇందులో తమకు సంబంధం లేదని చెప్పారు.

కాగా, డ్రగ్స్ దందా విషయంలో సినీనటుడు, నిర్మాత అశోక్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా వున్నాయి. అసలు చాలా పాఠశాల పిల్లలు డ్రగ్స్‌ వాడుతున్నారని, ఈ విషయంలో పోలీసులకు పక్కా సమాచారం వుంది, కానీ దాన్ని డైవర్ట్‌ చేయడానికే సినీ ఇండస్ట్రీని టార్గెట్‌ చేశారనిఆరోపించారు అశోక్‌కుమార్‌.

Also Read :   ఇంకా బావిలోనే చిన్నారి మీనా

సినీ పరిశ్రమలోకి వేరే ప్రాంతాల వారు వచ్చిన కారణంగానే డ్రగ్స్‌ వాడకం మొదలైందని, నోటీసులు ఇచ్చామంటూ ప్రచారం జరుగుతున్న వారిలో ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్న, శ్యామ్‌ కె.నాయుడుకు కనీసం మందు కూడా అలవాటులేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పాఠశాలలో పిల్లలు డ్రగ్స్‌కు బానిసలౌతున్నారని, ముందు వారిపై ద్రుష్టిపెట్టాలని సూచించారు అశోక్‌కుమార్‌.