మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత

దేశమంతా ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న మ‌క్కా మ‌సీదు పేలుళ్ల కేసు కోర్టు తీర్పు వ‌చ్చేసింది. 2007 మే 18న మక్కా మసీదులో పేలుళ్లు కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులుగా ఉన్న దేవేందర్‌గుప్తా, లోకేశ్‌ శర్మ, స్వామి అసీమానంద, భరత్‌ భాయి, రాజేందర్‌చౌదరిపై అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తరువాత ఈరోజు నాంపల్లి కోర్టు తుది తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో తీర్పు వెలువరిస్తుండ‌టంతో ఎంతో ఆత్రంగా చాలా మంది ఎదురు చూశారు. చివ‌ర‌కు ఈ ఉత్కంఠకు తెరపడింది. నిందితులపై వున్న నేరాన్ని రుజువు చేసేందుకు సరైన ఆధారాలు నిరూపించకపోవటంతో నిందితులను నిర్ధోషులుగా భావించిన కోర్టు కేసును కొట్టివేసింది.