Category : రాజకీయం

వైరల్ : రాహుల్ ట్యూబ్ లైట్

బాలీవుడ్ కండలవీరుడు తాజా చిత్రం ‘ట్యూబ్ లైట్ ‘. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్యూబ్ లైట్ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. రంజాన్ కి రిలీజైన సల్మాన్ సినిమాల్లో అత్యల్ప కలెక్షన్స్ ని సాధించింది ట్యూబ్ లైట్. ఇప్పుడీ ‘ట్యూబ్‌లైట్’ చిత్రం పోస్టరుపై సల్మాన్…

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడంటే ?

ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్ డీయే రాష్ట్రపతి అభ్యర్థి కోసం రామ్‌నాథ్ కోవింద్‌, యూపీ ఏ అభ్యర్థిగా మీరా కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థులు రాష్ట్రాల పర్యటనలకి ప్లాన్ చేసుకొని.. వివిధ పార్టీల మద్దతుని…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. అలవెన్సులకు సంబంధించి ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జులై 1 నుంచి సవరణ అలవెన్సులను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో లక్షలాదిమంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. నగరాల స్థాయి…

“మన అమరావతి” యాప్ వచ్చేసింది

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు “మన అమరావతి”యాప్ ని ప్రారంభించారు. బుధవారం సీఎం చంద్రబాబు సీఆర్డీయే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యాప్ ను ఆవిష్కరించారు. ఈ యాప్ లో 29 గ్రామాలకు చెందిన సమాచారంతో పాటు, పౌర సేవలను…

హైదరాబాద్‌కు రాష్ట్రపతి అభ్యర్ధి

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున పోటీ చేస్తున్న మీరాకుమార్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, గులాం నబీఆజాద్‌, సీతారాం ఏచూరి, శరద్‌ పవార్‌ తదితరుల సమక్షంలో మీరాకుమార్‌ నామినేషన్‌ పత్రాలను…

మంగళగిరి ఎమ్మెల్యే పై కేసు నమోదు

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం పెనుమాక సీఆర్డీఏ సదస్సులో తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ సీఆర్డీఏ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి తన అనుచరులతో…

మోడీకి ట్రంప్ ఘన స్వాగతం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు . అమెరికా పర్యటనలో భాగంగా నేడు మోడీ వైట్ హౌస్ లో జరిగిన ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ,.. తనకు లభించిన…

గ్రూప్ రాజకీయాలపై బాలయ్య కామెంట్

గ్రూపు రాజకీయాలకు భయపడేది లేదని అన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలోని గుడివాడ, మైలవరం నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేస్తానని వస్తున్న…

మీరాపై సుష్మా ఎటాక్

ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్‌పై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ విమర్శల దాడి చేశారు. 2013లో స్పీక‌ర్‌గా ఉండ‌గా మీరా కుమార్ వ్య‌వ‌హ‌రించిన శైలిని వివ‌రించే వీడియోను సుష్మాస్వ‌రాజ్ ట్వీట్ చేశారు. ఆరు నిముషాల వ్య‌వ‌ధిలో త‌న‌ను మాట్లాడ‌నీయ‌కుండా 60సార్లు అడ్డుకున్నార‌ని ఆమె…

నంద్యాల ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన జగన్

నంద్యాల ఉప ఎన్నిక వైకాపా అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి పేరు ఖరారైంది. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. కర్నూలు జిల్లా నేతలతో పాటు పార్టీకి చెందిన సీనియర్‌ నేతలతో జగన్‌ విస్తత స్థాయి చర్చలు జరిపిన తర్వాత…