జగన్ ఎక్కడ కనిపించడం లేదు : చంద్రబాబు


ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానితో ప్రస్తావించిన పలు అంశాలను వివరించారు. రాజధాని నిర్మాణానికి సహకరించాలని ప్రధానిని కోరినట్లు చంద్రబాబు తెలిపారు.

ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని, హోదాలోని అన్ని అంశాలను ప్యాకేజీలో ఇస్తామని అరుణ్‌జైట్లీ ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీలోని అన్నింటినీ వెంటనే ఇవ్వాలని కోరామని, విభజన హామీల అమలుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

Also Read :   రజనీకాంత్ పార్టీ లో యంగ్ హీరో..

కేంద్రంపై తన కంటే ఒత్తిడి తెచ్చేవారు ఎవరున్నారని చంద్రబాబు ప్రశ్నించిన చంద్రబాబు,జగన్ రాజీనామాలు చేయిస్తానని చెప్పారని, ఎప్పుడు ఆయన ఇక్కడికి వెళ్లారని నిలదీశారు. ఏపీ అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్తుందని, కేంద్రం సహకరిస్తే గట్టెక్కుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.