కేసిఆర్ కు చంద్రబాబు ఫోన్

kcr

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు… ఇరుగు పొరుగునే ఉన్న తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు. వీరిద్దరూ సంబధించిన వార్త ఏదైనా ఆసక్తికరమే. వీరిద్దరు ఒకే వేదిక పై ఎప్పుడూ కనిపించినా అదో స్పెషల్ న్యూస్ గా అవుతుంటుంది. ఇప్పటికే పలు సందర్భల్లో వీరి కలయిక జరిగింది.

తాజగా వీరిద్దరికి సంబధించిన మరో వార్త ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు తన 63వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ, ఇతర ప్రముఖులు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కేసీఆర్ కు ఫోన్ చేసి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పలు కుశల కబుర్లు కూడా చెప్పుకున్నారని తెలుస్తోంది.