నారా దేవాన్ష్ పేరుతో అన్నదానం

cbn

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనవడు దేవాన్ష్‌ పేరు మీద టీటీడీ అన్నదానం ట్రస్ట్‌కు చంద్రబాబు కుటుంబ సభ్యులు రూ.25 లక్షల విరాళం ఇచ్చారు. జేఈవో శ్రీనివాసరాజుకు లోకేష్‌ తరపు ప్రతినిధులు చెక్కు అందజేశారు.

ఈ సందర్భం జేఈవో శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. రేపు లోకేష్ కుమారుడైన దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు చంద్రబాబునాయుడు 25 లక్షల విరాళమిచ్చారని చెప్పారు. రేపు (మంగళవారం) దేవాన్ష్ పేరిట టీటీడీ అన్నదానం నిర్వహించనుందని వెల్లడించారు. మనవడి పుట్టిన రోజును పురస్కరించుకుని తిరుమలలో ఒకరోజు అన్నదానంకయ్యే ఖర్చును భరించాలని గతంలో నిర్ణయించారని, ఆమేరకు ఆయన ఈ మొత్తాన్ని పంపించారని చెప్పారు జేఈవో