బిజెపి టీడీపీ పొత్తు ఉంటుంది కానీ


తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ.. చంద్రబాబునాయుడు ఏపీకి రావాల్సిన అన్నింటినీ సాధించుకుని వస్తారని, ఆయన తెలివైన వారని వ్యాఖ్యానించారు.

బీజేపీ-టీడీపీ పొత్తు కొనసాగుతుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘నాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారం కలిసే ఉంటామని అనుకుంటున్నా. ఏ అభిప్రాయాలున్నా కలిసిపోక తప్పదు. ఎక్కువ సీట్లు వాళ్లు (బీజేపీ) అడగడం మంచిది కాదు, మా ముఖ్యమంత్రి ఒప్పుకోవడం అంతకన్నా మంచిది కాదు’ స్పష్టం చేశారు.