అక్కడ ముద్రగడ.. ఇక్కడ కోదండరాం రిజల్ట్ సేమ్

ఏపీలో ముద్రగడ, తెలంగాణలో కోదండరాంల పరిస్థితి దాదాపు ఒకలాగే కనిపిస్తున్నాయి. ఏపీలో కాపు ఉద్యమాన్ని భుజాలపై వేసుకొన్న ముద్రగడ.. మరోసారి పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఆయన ‘ఛలో అమరావతి’ పాదయాత్రని పోలీసులు ఆదిలోనే అడ్డుకుంటున్నారు. ఎప్పటిలాగే పాదయాత్రకి బయలుదేరిన ముద్రగడ నిరాశగా వెనుతిరుగుతున్నారు.

ఇక, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలని వేలెత్తి చూపిస్తున్న టీ-జేఏసీ చైర్మెన్ కోదండ రామ్ పరిస్థితి కూడా ఇంతే. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో మళ్లీ పర్యటించడానికి బయల్దేరుతున్న కోదండరామ్ స్పూర్తి యాత్రను పోలీసులు అడ్డుకొన్నారు. ఎప్పటిలాగే ఆయన్ని అరెస్ట్ చేసి హైదరబాద్ లో విడిచిపెట్టడం జరుగుతోంది.

Also Read :   మీరాపై సుష్మా ఎటాక్

మరి.. ఈ ఇద్దరు తెలుగు రాష్ట్రల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలని దెబ్బకొట్టగలరా.. ? వచ్చే సాధారణ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ ఎస్ కి అధికారం దక్కకుండా కీలక పాత్ర పోషించగలరా.. ? చూడాలి.

Tagged: , , , , , ,