నంద్యాల ఉప ఎన్నిక : వైసీపీకి బిగ్ షాక్

ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో.. టీడీపీ, వైసీపీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. తాజాగా, టీడీపీ వేసిన ఓ ఎత్తుకి వైసీపీ దిమ్మ తిరిగిపోయింది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరొందిన ముస్లిం నేత కరీం టీడీపీ తీర్థం పుచ్చుకొన్నారు. దీంతో టీడీపీ వైసీపీని మానసికంగా దెబ్బకొట్టినట్టయ్యింది. నేషనల్ విద్యాసంస్థల ఛైర్మన్ గా, నంద్యాల కూరగాయల మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా, మైనార్టీ నేతగా కరీంకి మంచి పేరుంది.

Also Read :   డ్రగ్స్ కేసులో ఎంటరైన రేవంత్ రెడ్డి

మరోవైపు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకటసాయి శ్రీనివాసరావు టీడీపీలో చేరేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన గుత్తులని ప్రజాధారణ ఉన్న నేతగా చెబుతుంటారు. మంత్రులు యనమల, చినరాజప్ప, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు లు గుత్తులని టీడీపీలో చేరేందుకు ఒప్పించారు. ఈనెల 14వ గుత్తుల టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీ నేతలు క్యూ కట్టడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి.

Tagged: