పోలవరం పూర్తికావడం అసాధ్యం : పవన్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి పోలవరం ప్రాజెక్ట్’ని సందర్శించారు. సడెన్’గా పవన్ పోలవరం ప్రాజెక్టు సందర్శించడంపై ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. సీఎం చంద్రబాబు సూచనతోనే పవన్ పోలవరం వెళ్లారని ఆరోపించింది. ఇలాంటి నేపథ్యంలో పోలవరం సందర్శించిన అనంతరం పవన్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది.

అధికారులని అడిగి పోలవరం ప్రాజెక్ట్ విషయాలని తెలుసుకొన్న పవన్.. వాటిని నోట్ చేసుకొన్నారు కూడా. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. “2018 సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు పూర్తికావడం అసాధ్యమే. సెక్రటేరియేట్‌ కట్టలేనివాళ్లు పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు?. ప్రాజెక్టుపై సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే”నన్నారు.