‘ఓఎల్ఎక్స్’ లో జగన్ పార్టీ !

jagan (23)

వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డినితీవ్రస్థాయి లో మండిపడ్డారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. జగన్ కు అన్నీ తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయనీ, తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బుద్ధులు వస్తే కొంతైనా బాగుండేదని, తాత లా నరకడం , హింసను ప్రోత్సహించడమే జగన్ కు తెలుసనీ తీవ్ర ఆరోపణ చేశారు. కులం, వర్గంతో అడ్డుపెట్టుకొని జగన్ రాజకీయం చేయడం మానుకోవాలి సూచించారు జేసి.

మరో టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. జగన్ తన నల్లధనం మూలాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అవినీతి మూలాలపై చర్చ జరగకుండా జగన్ అడ్డుకుంటున్నారని, జగన్ ను ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం, ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం వదిలిపెట్టవని, త్వరలో ఆయన జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. అసలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను బయటపెట్టాలని డిమాండ్ చేసిన ఆయన.. వైఎస్సార్సీపీని త్వరలోనే ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టక తప్పదనిఎద్దేవా చేశారు.