పవన్ కళ్యాణ్ కి పోలవరం ఏంటో తెలుసా?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం చేరుకున్న పవన్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం హిల్‌ వ్యూ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్‌వే, డయా ఫ్రంవాల్‌ నిర్మాణం, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, నిర్మాణాల్లో ప్రగతిని ఇంజినీర్లు వివరించారు.

ఇదీలా వుంటే ఆయన పోలవరం పర్యటన పై వైసీపీ నాయకురాలు రోజా తీవ్ర విమర్శలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ కు పోలవరం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకుడు జగన్ ఏం పని చేసినా దాని ననుండి డైవర్ట్ చేయడనికి ఒక ప్యాకేజీ తీసుకొని పవన్ కళ్యాణ్ ఇలా పర్యటనలు చేస్తుంటారని ఒక రెండు రోజులు హడావిడి చేసి మళ్ళీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడని ఎద్దేవా చేశారు రోజా,