ఉపరాష్ట్రపతి పదవిపై వెంకయ్య మనసులో మాట

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేరు దాదాపు ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పదవికి వెంకయ్యనాయుడు అన్నివిధాలా సమర్థుడనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట్టు కధనాలు వెలువరుస్తున్నాయి. వెంకయ్యనాయుడు అయితేనే, భాగస్వామ్య పక్షాలన్నీ ఆమోదిస్తాయనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. పార్టీ కీలక నేతగా సంక్షోభ సమయాల్లో వెంకయ్యనాయుడు పోషించిన పాత్రను బీజేపీ పరిగణనలోకి తీసుకుందని, వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వంపై ఎన్డీఏ పక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని, ఏ రకంగా చూసినా కూడా ఉపరాష్ట్రపతి పదవికి ఆయనే అర్హుడని, ఆ పదవికి వన్నె తెస్తారనే సమష్టి అభిప్రాయానికి ఎన్డీఏ పక్షాలు వచ్చాయని కధనాలు వినిపిస్తున్నాయి.

Also Read :   మంత్రులతో కళకళాడుతున్న పార్లమెంట్..

ఐతే దీనిపై వెంకయ్య స్పందించారు. ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవి విషయంలోఇలాంటి వూహాగానాలు సరికాదని సూచించారు వెంకయ్య. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ముగిసిన తర్వాత బిజెపి పార్లమెంటరీ భేటీ ఉంటుందని, ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చిస్తామని, అనంతరం జరిగే బిజెపి కోర్‌కమిటీ భేటీలోనూ ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ ఉంటుందని, అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తామని, అప్పటి వరకు అభ్యర్థి ఎంపికపై వూహాగానాలు చేయడం సరికాదని సుచన చేశారు వెంకయ్య.

Tagged: