రివ్యూ: అప్పట్లో ఒకడుండేవాడు – యాక్షన్‌ ఎంటర్టైనర్

టైటిల్ : అప్పట్లో ఒకడుండేవాడు (2016)
స్టార్ కాస్ట్ : నారా రోహిత్‌ , శ్రీవిష్ణు ,తాన్య హోప్‌..తదితరులు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సాగర్‌ కె.చంద్ర
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్‌
మ్యూజిక్ : సాయి కార్తీక్‌
విడుదల తేది : డిసెంబరు 30, 2016
తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5

రివ్యూ : అప్పట్లో ఒకడుండేవాడు యాక్షన్‌ ఎంటర్టైనర్

Appatlo-Okadundevadu-telugu

నారా రోహిత్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో తానియా హోప్ హీరోయిన్ గా ‘అయ్యారే’ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన మూవీ ‘అప్పట్లో ఒకడుండేవాడు’. రోహిత్ సమర్పణలో ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్ ఫై తెరకెక్కిన ఈ మూవీ ఫై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి..మరి అంచనాలు అందుకుందా..అప్పట్లో ఆ ఒక్కడు ఎవడు..అతని కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

రైల్వే రాజు (శ్రీవిష్ణు) గొప్ప క్రికెటర్‌ కావాలని , దేశానికి మంచి పేరు తీసుకరావాలని ఇతడి కోరిక..ఆ కోరిక తీర్చుకోవడానికి రేయి పగలు కష్టపడతాడు…అతడి కష్టానికి తగిన ఫలితం రాబోతుంది…జాతీయ జట్టు లో స్థానం లభించింది అనుకునే టైం ఇంతియాజ్‌ (నారా రోహిత్‌) తన లైఫ్ లోకి వస్తాడు..స్టిక్ పోలీస్ ఆఫీసర్ అయినా ఇంతియాజ్‌ , నక్సలైట్లను పట్టుకోవడం లో దిట్ట…

ఓ నక్సల్‌ ముఠాకి సంబంధించిన కీలక సమాచారం రైల్వే రాజు దగ్గర ఉందన్నది అతని అనుమానం. దాంతో రైల్వే రాజు ను అరెస్ట్ చేసి జైలు కు పంపుతాడు..ఆ తర్వాత ఏం జరుగుతుంది..జైలు నుండి రైల్వే రాజు ఎలా బయటకు వస్తాడు..క్రికెటర్ కావాలన్నా అతడి కోరిక నెరవేరుతుందా లేదా..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే..

ప్లస్ :

* స్టోరీ

* శ్రీవిష్ణు యాక్టింగ్

* క్లైమాక్స్

* నేపధ్య సంగీతం

మైనస్ :

* సెకండ్ హాఫ్

* హీరోయిన్

* కామెడీ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

ముందుగా శ్రీవిష్ణు గురించి చెప్పాలి..ఎందుకంటే సినిమాని చాల వరకు నడిపింది అతడే కాబట్టి.. క్రికెటర్ కావాలని తల్లి బాగా చూసుకోవాలని కలలు కన్నా అతడు అనుకోకుండా జైల్ కు వెళ్ళతాడు..ఆలా వెళ్లిన అతడు ఓ క్రిమినల్ గా మారే క్రమం లో అతడు చేసిన యాక్టింగ్ సినిమా కే హైలైట్ గా నిలిచింది..అంతే కాదు నారా రోహిత్ – విష్ణు మధ్య వచ్చే సన్నివేశాల్లో విష్ణు నటన బాగా ఆకట్టుకుంటుంది.

ఇక నారో రోహిత్‌ నటన గురించి పెద్దగా చెప్పడానికి ఏమి లేదు.. ఇక హీరోయిన్ గా నటించిన తాన్య హోప్‌ పాత్రకు అసలు స్కోప్ లేకుండా పోయింది..కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి పండించిన కామెడీ వర్క్ అవుట్ కాకపోగా సినిమాకు మైనస్ గా నిలిచింది.. బ్రహ్మాజీ, రాజీవ్‌ కనకాల, ప్రభాస్‌ శీను, జీవీ, సత్యదేవ్‌ వారి వారి పాత్రలకు తగట్టు పర్వాలేదు అనిపించారు..

సాంకేతిక విభాగం :

స్టోరీ కి తగట్టు సినిమా ఫోటోగ్రఫీ అందించి సక్సెస్ అయ్యాడు నవీన్‌ యాదవ్‌ ..అలాగే సంగీతం గురించి చెప్పాలంటే సాయి కార్తీక్ అందించిన నేపధ్య సంగీతం కు మంచి మార్కులు కొట్టేసాడు. ఇక డైలాగ్స్ కూడా ఎంత మేరకు కావాలో అంతే లెవల్లో ఉన్నాయి.. నిర్మాణ విలువలు బాగున్నాయి..

చివరిగా :

అయ్యారే చిత్రం తో ఎంతగానో ఆకట్టుకున్న సాగర్‌ కె.చంద్ర ..మరోసారి విభిన్న కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యాడు..కొత్త దర్శకులు అంటే ప్రేమ కథలు , కామెడీ కథలను మాత్రమే తెరకెక్కిస్తారని అనుకునే వారికీ ఇలాంటి కథతో కూడా ఆకట్టుకుంటారని చెప్పాడు చంద్ర..మొత్తానికి ‘ అప్పట్లో ఒకడుండేవాడు – ఇప్పట్లో అందరూ చూసేలా ‘ ఉంటుంది..

Tagged: , ,